ఆ జాలి ప్రేమను గమనింపకుందువా?
ఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువా?
ఓ సోదరా. . . ఓ సోదరా . . . ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా?
1. నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియే
ఆ సిల్వపైన నీకై మరణ బాధ నొందెను
నీ శిక్ష బాపగా రక్షణను చూపగా
ని హృదయ ద్వారమందు వేచియుండెగా
నీ రక్షకుండు యేసు నిన్ను పలచుచుండెను
ఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా?
2. ఎంత పాపినైనా గాని యేసు చేర రమ్మనె
యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు
నీ పాప జీవితం ప్రభుయేసు మార్చగా
నీ చెంత చేరి నిన్ను పిలచుచుండెను
విలువైన రక్త ధార ప్రేమతోడ గార్చెను
ఆ ప్రేమ మూర్తి పిలుపు ఆలకింపజాలవా?
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆ జాలి ప్రేమను గమనింపకుందువా? ఆ Lyrics
Your favourites
- No Favourites found!
