Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆ కలువరి మార్గములో యేసు సిలువను Telugu Christian Song Lyrics

ఆ కలువరి మార్గములో యేసు సిలువను Lyrics

ఆ కలువరి మార్గములో - యేసు సిలువను మోసెను
రక్షణ నివ్వను ఓ సోదరా - నెమ్మది నివ్వను ఓ సోదరీ (2)
1. గరుకు రాళ్ళ మార్గములో - బరువు సిలువను మోసెను (2)
కొరడాలతో కొట్టిరి - దేహమంతా చీలెను (2)
2. మేకులు కొట్టిరి కాళ్ళకు - తలకు ముండ్ల కిరీటము
యేసు రక్తము నదివలె - సిలువపై నుండి ప్రవహించె
3. గాయపడిన చేతులు చాచి - ప్రభువు పిలచుచుండెను
పాపపు స్థితిని మార్చను - నిత్య జీవము నివ్వను
4. పాపములోనే ఉందువా - పాపము వలన మరణము
నీ పాపములను ఒప్పుకో - కడుగును యేసు రక్తము
5. హృదయ తలుపు తట్టుచున్నాడు - తెరువుము నీ హృదయము
చేర్చుకొనుము యేసుని - శాంతి నీకు దొరుకును


Your favourites

  • No Favourites found!