Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా Telugu Christian Song Lyrics

ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా Lyrics

ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక
యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్ ||ఆద||

1. నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు
నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా

2. సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు
లొసగుము నీతి నిధుల సజీవుడా ||ఆద||

3. ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి
నా ప ద్బాంధవ విడిపించుమా ||ఆద||

4. పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా
మొరను గైకొని కలుషముల నెడబాపవే ||ఆద||

5. పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు
విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా ||ఆద||

Your favourites

  • No Favourites found!