ఆదినములలో దేవోక్తి - అరుదాయెను - దేవునివార్త
ఆదినములలో దేవోక్తి
అను దైవోక్తి ప్రత్యక్షత - దొరుకునదే - అరుదాయెనట
ఆదినములలో దేవోక్తి
1. ఇశ్రాయేలీయుల కానాడు - యే రాజు లేకపోయె
తనయిష్టానుసారముగా తిరుగుచుండెను ప్రతివాడు
2. పరమ తండ్రి మందసము - చెరపట్టినందున
ప్రభావము పోయెను - ప్రభుని ప్రజలలో నుండి
3. దావీదంతకంతకు - దినదినము వర్థిల్లెను
సైన్యములధిపతి యెహోవా - సర్వదా తనతోడై యుండెను
4. సొలమోనర్పించిన - బలుల నగ్ని కాల్చగనే
ప్రభుని ఆలయమంతయు - ప్రభావముతో నిండెను
5. లెమ్ము తేజరిల్లుము - నీకు వెలుగు కలిగెను
యెహోవా తండ్రి మహిమ - నీ మీద నుదయించెను
6. యెహోవా పట్టణమని - ఇశ్రాయేలు పరిశుద్ధ
దేవుని సీయోనని - నీకు పేరు పెట్టెదరు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆదినములలో దేవోక్తి అరుదాయెను దేవునివార్త ఆదినములలో Lyrics
Your favourites
- No Favourites found!
