Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆగని పరుగులో ఎండిన ఎడారులు Telugu Christian Song Lyrics

ఆగని పరుగులో ఎండిన ఎడారులు Lyrics

ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2)
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపున
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై
కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి
అందించే నీ చేయి – నా స్నేహమై     ||ఆగని||

లోకప్రేమే సదా – కలల కడలే కదా
తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం
యేసయ్యా… అర్పించెదా – నా జీవితం     ||ఆగని||

ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా – జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం
యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము     ||ఆగని||

Your favourites

  • No Favourites found!