Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆహా ఆనందమే పరమానందమేప్రియ యేసు నొసగె Telugu Christian Song Lyrics

ఆహా ఆనందమే పరమానందమేప్రియ యేసు నొసగె Lyrics

ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా||
నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే (2)
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను (2) ||ఆహా||
నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ (2)
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి (2) ||ఆహా||
నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని (2)
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా||
మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో (2)
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే (2) ||ఆహా||

Your favourites

  • No Favourites found!