ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో దాహ మాయెను నీకు
సిల్వపై ద్రోహు లందరు గూడి రయ్యయ్యో నీదు దేహంబు బాధించి
రయ్యయ్యో ||యాహా||
1. దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు
తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా ||ఆహా||
2. కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై
ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||
3. కాలుసేతులయందు వారలు ఇనుప చీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి
సుమంతైన జూపక వారు గేలిజేయుచు బాధపెట్టిరా ||ఆహా||
4. బాధ తగ్గింపరాణువవారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనస్సు
దానినొల్లక గొప్ప వేదనలను భరియించెనే ||ఆహా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో Lyrics
Your favourites
- No Favourites found!
