Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆహా మహాత్మ హా శరణ్యా హా Telugu Christian Song Lyrics

ఆహా మహాత్మ హా శరణ్యా హా Lyrics

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను
నా దోషమేగదా ||యాహా||

1. "వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్" కోరి తిటులు నిన్నుఁ
జంపు క్రూరజనులకై ||యాహా||

2. "నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు" పావనుండ యిట్లుఁ బలికి
పాపిఁ గాచితి ||వాహా||

3. "అమ్మా! నీ నుతుఁడ" టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర "నీ
జనని" యంచుఁ గర్త నుడివితి ||వాహా||

4. "నా దేవ దేవ యేమి విడ నాడితి" వనుచు శ్రీదేవ సుత పలికితివి
శ్రమ చెప్పశక్యమా ||యాహా||

5. "దప్పికొనుచున్నా న" టంచుఁ జెప్పితివి గద యిప్పగిదిని బాధ నొంద
నేమి నీకు హా! ||యాహా||

6. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా "సమాప్తమైన" దంచుఁ
దెలిపి సమసితివి గదా ||యాహా||

7. "అప్పగింతుఁ దండ్రి నీకు నాత్మ" నంచును గొప్ప యార్భాటంబు చేసి
కూలిపోతివా ||యాహా||

Your favourites

  • No Favourites found!