Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం Telugu Christian Song Lyrics

ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం Lyrics


ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం (2)
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2)
మార్గము నీవే – జీవము నీవే       ||ఆకాశం||

పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా (2)
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా       ||ఆకాశం||

నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా (2)
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా       ||ఆకాశం||

భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2)
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా       ||ఆకాశం||

Your favourites

  • No Favourites found!