Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆకాశము నీ సింహాసనం Telugu Christian Song Lyrics

ఆకాశము నీ సింహాసనం Lyrics


ఆకాశము నీ సింహాసనం
భూలోకము నీ పాద పీఠము
మహోన్నతుడా – మహా ఘనుడా
నీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము

స్తుతులకు పాత్రుడా యేసయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా
జీవాధిపతివి నీవయ్యా
జీవము గల మా యేసయ్యా

పాపుల రక్షకా యేసయ్యా
రక్షించుటకు పుట్టావయ్యా
నీ సిలువే నా మరణమును
తప్పించి రక్షించెనయ్యా

అద్భుతకారుడా మహనీయా
ఆశ్చర్యకరుడా ఓ ఘనుడా
దయగల మా ప్రభు యేసయ్యా
కృపగల మా ప్రభు నీవయ్యా

రానైయున్న యేసయ్యా
బూరధ్వనితో నీవేనయ్యా
మధ్యాకాశంలో విందయ్యా
ఎంతో ధన్యత మాకయ్యా

Your favourites

  • No Favourites found!