Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను Telugu Christian Song Lyrics

ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను Lyrics


1.
ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి
సమయమున ప్రార్థన చేతుము మా దేవా||

2.
చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా
ప్రభువా గావుము గావుము నీ నీడన్||

3.
చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే
గొలిచి నిద్రించున్||

4.
చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా
చెన్నుగ యేసూగావుమా||

5.
నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి
విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్||

6.
రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును
గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా||

7.
తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్
మేల్కొల్పుము నా ప్రియతండ్రి||

8.
జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము
నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్||

Your favourites

  • No Favourites found!