Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆలకించు దేవా స్తోత్రాలాపన Telugu Christian Song Lyrics

ఆలకించు దేవా స్తోత్రాలాపన Lyrics

ఆలకించు దేవా స్తోత్రాలాపన
ఆత్మతో సత్యముతో ఆరాధించెదం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

నీవు చేసిన మేళ్లను తలచి
మహిమ పరచెదము నిరంతరం
కృతజ్ఞత స్తుతులర్పించెదమ్
కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో
సంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము

నశించు జనులను రక్షింపను
సిలువలో రక్తము కార్చితివా
నజరేయుడ నిజ రక్షకుడా
రక్షణ ఆనందము స్వస్థత సంతోషము
శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా

ప్రతి విషయములో ప్రార్ధించెద౦
ప్రతి రోజు ఇల ప్రార్ధించెదం
ప్రజలందరికై ప్రార్ధించెదం
ప్రార్ధననాలించు దేవా పరిస్థితులు మార్చు దేవా
ప్రార్ధన చేసెదం విజ్ఞాపన చేసెదం

Your favourites

  • No Favourites found!