ఆనందమానంద మాయెను - నాదు
ప్రియకుమారుని యందు - మహాదానంద
అను నా తనయుని మాట వినండని
శబ్దమొక్కటి యా మేఘములో
ఉద్భవించె నద్భుతముగ
1. ప్రేమించుచున్నాను నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవు
అందుచే నీతోటి వారికంటె - ఆనంద తైలముతో తండ్రి నిన్ను
అధికంబుగ నభిషేకించెను ǁమహానందమానంద
2. అంత్య దినముల యందున - ఆ వింత కుమారుని ద్వరా - ఈ
మానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయుని
వారసునిగా నియమించెను ǁమహానందమానంద
3. తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానే
మహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచు
అందరిలో అతి శ్రేష్టుండాయె ǁమహానందమానంద
4. నీవు నాదు కుమారుండవు - నిన్ను ప్రేమించి కన్నాను నేను - నేడు
దండిగ తనయుని ముద్దాడెను - నిండుగాయన నాశ్రయించుడి
రండి రండి ధన్యులు కండి ǁమహానందమానంద
5. విజ్ఞాన సంపాద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను - ఆ
సంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియు
విమోచన మాయెను యేసు ǁమహానందమానంద
6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై యున్నావు - నీవు
నీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసము
నిన్నాశీర్వదించెను తండ్రి ǁమహానందమానంద
7. దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును - మహా
అంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురో
అందరును పాలించెదరు ǁమహానందమానంద
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు Lyrics
Your favourites
- No Favourites found!
