Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు Telugu Christian Song Lyrics

ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు Lyrics

ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు
||మహదానం||

1. ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు
అందుచే నీ తోటి వారికంటె ఆనందతైలముతో తండ్రి
నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం||

2. అంత్యదినముల యందున ఆ వింతకుమారునిద్వారా ఈ
మానవులతోడ మాట్లాడెను సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా
నియమించెను ||మహదానం||

3. తనయుండె ఆ తండ్రి మహమ ఆ తత్వంబు రూపంబు తానె
ఆ మహాత్యమైనట్టి మాటలచేత సమస్తమును నిర్వహించు అందరిలో
అతి శ్రేష్ఠుండాయే ||మహదానం||

4. నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను
నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి
రండి ధన్యులు కండి ||మహదానం||

5. విజ్ఞాన సంపద లెల్లను ఆ సుజ్జానిలో గుప్తమాయెను ఆ
సంతోసహమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు
విమోచనమాయెను ||మహదానం||

6. అందరికన్న నీవెంతనో అతి సుందరుడవై యున్నావు నీవు
నీ పెదవుల మీద పోయబడి నిండి యున్నది దయారసము
నిన్నాశీర్వదించును తండ్రి ||మహదానం||

7. దివ్యరారాజై కుమారుడు ఒక వెయ్యివర్షాలు పాలించును
మహా అంతములేని రాజ్యమేలును యెందరు జయంబు
నొందుదురో అందరును పాలించెదరు ||మహదానం||

Your favourites

  • No Favourites found!