Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను Telugu Christian Song Lyrics

ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను Lyrics

ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||
ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||
అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము||
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||

Your favourites

  • No Favourites found!