ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతో
అను రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును
హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును
1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను
పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను
2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను
పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను
3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెను
పదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను
4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెను
సమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను
5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను
ప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు
6. అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువా
హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతోఅను రక్షణ Lyrics
Your favourites
- No Favourites found!
