Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనందించెదము ప్రభు యేసులో అంతయు మరలార్జించు Telugu Christian Song Lyrics

ఆనందించెదము ప్రభు యేసులో అంతయు మరలార్జించు Lyrics

1. ఆనందించెదము - ప్రభు యేసులో - అంతయు మరలార్జించు కొంటిమి
ఆదాము నుండి పోయిన దెల్లయు - అనుభవించు చున్నామిప్పుడు
నష్టము నంతటిని మరల - మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము
2. దావీదువలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి
3. పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమై యుంటిమి అపుడు
మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత
4. మొదటి ప్రమను కోల్పోతిమిల - వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి
పొందితిమి యేసు ప్రభువులో - నిండుగను దైవ ప్రేమను
5. దేవుని కల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి
పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి
6. నిరీక్షణయేమి లేక యుంటిమి - నరకమున కర్హులమై యుంటిమి
ఘనుడగు యేసు నంగీకరింపగా - నన్నును విమోచించెను
7. పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి
శాపమునందు చుట్టబడితిమి - సర్వమొందెదము మరల


Your favourites

  • No Favourites found!