Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనందింతు నీలో దేవా Telugu Christian Song Lyrics

ఆనందింతు నీలో దేవా Lyrics

ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు (2)
మధురమైన నీ నామమునే (2)
మరువక ధ్యానించెద ప్రభువా           ||ఆనందింతు||

ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా (2)
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర (2)         ||ఆనందింతు||

నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా (2)
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన (2)         ||ఆనందింతు||

శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న (2)
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము (2)         ||ఆనందింతు||

శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ (2)
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2)         ||ఆనందింతు||

Your favourites

  • No Favourites found!