ఆరాధింతు ఆత్మరూప
ఆత్మతో సత్యముతో (2)
నేను నిన్ను స్తోత్రించుటకు
నీవె కారణభూతుడవు (2)
1. ఊరి వెలుపలగా నే నుంటి
దారి ప్రక్కను పడియుంటి (2)
ఘోర వ్యాధితో బాధ పడగా
చేరి నను కరుణించితివి (2)
||ఆరాధింతు||
2. నాదు పెదవులు అపవిత్రములు
నాదు పాదములపవిత్రం.. (2)
కొంత కాదు కొన్ని కాదు
మొత్తమంతా దోషములే (2)
||ఆరాధింతు||
3. ఇష్టపడితివి నను రక్షింప
కష్టపడితివి కలువరిలో (2)
శుద్ధికలుగుట చూడగానే
బుద్ధి కలిగెను స్తుతియింప (2)
||ఆరాధింతు||
4. దంచి విసరి నలిపి కాల్చ
రొట్టె యాయెను గోధుమలు (2)
అట్టి నీదు దేహమునకు
రొట్టెనిడితివి సూచనగా (2)
||ఆరాధింతు||
5. నాదు చేదును త్రాగిన వాడ (యేసు)
క్రోధ పాత్రను త్రాగితివా (2)
రక్త గుర్తుగా పాత్రనుంచినా
మధుర ప్రేమకు స్తోత్రములు (2)
||ఆరాధింతు||
