ఆరాధించెదను నిన్ను నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2x)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2x)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2x)
1. నీ జీవవాక్యము నాలో - జీవము కలిగించే (2x)
జీవిత కాలమంత, నా యేసయ్య - నిన్నే కొలిచెదను (2x)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2x)
2. చింతలెన్ని కలిగినను - నిందలన్ని నన్ను చుట్టినా (2x)
సంతోషముగ నేను, నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2x)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2x)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2x)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2x)