Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది Telugu Christian Song Lyrics

ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది Lyrics


పల్లవి : ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది
అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది


1. సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది
ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది


2. నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి
క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది
ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది


3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు
చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా
ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు
ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది

Your favourites

  • No Favourites found!