Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త Telugu Christian Song Lyrics

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త Lyrics

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2)
                                         ||ఆశ్చర్యకరుడు||
1. తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)
                                        ||ఆశ్చర్యకరుడు||
2. మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2)
                                        ||ఆశ్చర్యకరుడు||

Your favourites

  • No Favourites found!