Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము Telugu Christian Song Lyrics

ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము Lyrics

ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన||

1. పరమును వీడిన ప్రేమ
ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి
సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన||

2. పావన యేసుని ప్రేమ
సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి
జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన||

3. శ్రమలు సహించిన ప్రేమ
నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది
ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన||

4. నా స్థితి జూచిన ప్రేమ
నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి
ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||

Your favourites

  • No Favourites found!