Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశీర్వాదము Telugu Christian Song Lyrics

ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశీర్వాదము Lyrics

ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశీర్వాదము నీయుమ
ఆశలుదీరంగ నాయు వొసంగుచు వాసిగ కరుణను వర్ధిల్ల బిడ్డకు
||ఆశీర్వాదము||

1. యేసు పెరిగిన యట్టులే నీ దయయందు ఈసు బిడ్డను పెంచుము
వాసిగ మనుజుల కరుణయందున బెరుగ భాసుర వరమిచ్చి బాగుగ
బెంచుము ||ఆశీర్వాదము||

2. నెనరు మీరగ మోషేను నెమ్మదియందు తనర బెంచినట్లుగ ఘనముగ
నీ శాంతి సంతసములయందు తనర నీ బిడ్డను తగురీతి బెంచుము
||ఆశీర్వాదము||

3. ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగ బెంచితివో యారీతి నీ
బిడ్డ నాత్మ స్నేహమునందు కోరి బెంచుము ప్రభువ కోర్కెలూరగ వేగ
||ఆశీర్వాదము||

4. సత్య విశ్వాసమునందు చక్కగ బెరుగ శక్తి యొసంగినడ్పుమా సత్య
వాక్యమునందు సరగను వర్ధిల్ల నిత్యము నీ కృప నిచ్చి బ్రోవుమ ప్రభువ
||ఆశీర్వాదము||

5. భక్తి ప్రేమల నీ బిడ్డ బాగుగా బెరుగ శక్తినీయ మా ప్రభువ ముక్తి
పథంబున ముద్దుగ నడువంగ యుక్తజ్ఞానము నిచ్చి యుద్ధరించుమ ప్రభువ
||ఆశీర్వాదము||

Your favourites

  • No Favourites found!