Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యానా Telugu Christian Song Lyrics

ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యానా Lyrics

ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను (2) ||ఆశ్రయమా||
కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు (2) ||ఆశ్రయమా||
భక్తిహీనులు నాపై పొర్లిపడినను
శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2)
నా వెంటే నీవుండినావు
కాపాడి రక్షించినావు (2) ||ఆశ్రయమా||
మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2)
నా వెంటే నీవుండినావు
దయచూపి దీవించినావు (2) ||ఆశ్రయమా||

Your favourites

  • No Favourites found!