Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యాఆత్మ వర్షమును కుమ్మరించయ్యా Telugu Christian Song Lyrics

ఆత్మ వర్షమును కుమ్మరించయ్యాఆత్మ వర్షమును కుమ్మరించయ్యా Lyrics

ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2)
నీ ఆత్మ చేత అభిషేకించి (2)
నీ కృప చేత బలపరచయ్యా (2)
నే ఉన్నది నీ కోసమే యేసయ్యా
నీ సింహాసనం చేరితినయ్యా ||ఆత్మ||
బలహీనతతో నన్ను బలపరచుము
ఒంటరైన వేళలో ధైర్యపరచుము (2)
కృంగిన వేళ నీ దరి చేర్చి (2)
నీ ఆత్మ శక్తితో బలపరచయ్యా (2) ||నే ఉన్నది||
ఆత్మీయుడవై నన్ను ఆదరించుము
అలసిన వేళ దర్శించుము (2)
అవమానములో నీ దరి చేర్చి (2)
నీ ఆత్మ శక్తితో స్థిరపరచయ్యా (2) ||నే ఉన్నది||

Your favourites

  • No Favourites found!