Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున Telugu Christian Song Lyrics

ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున Lyrics

ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ
సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప
నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను||

1. ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి
మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను||

2. క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో
ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||యాత్మలను||

3. పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ
డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను||

4. నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ
ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక ||నాత్మలను||

5. జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను
గడింప నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను||

6. నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు
విభుని సేవకు నీ వర్పించు ||నాత్మలను||

Your favourites

  • No Favourites found!