Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆత్మ విషయమై దీనులైనవారుధన్యులు పరలోక రాజ్యము Telugu Christian Song Lyrics

ఆత్మ విషయమై దీనులైనవారుధన్యులు పరలోక రాజ్యము Lyrics

1. ఆత్మ విషయమై - దీనులైనవారు
ధన్యులు పరలోక - రాజ్యము వారిది
దుఃఖపడువారు - ధన్యులు ధన్యులు
వారు ఓదార్చ - బడుదురు
2. సాత్వీకులు ధన్యులు వారు
భూలోకమును స్వ - తంత్రించుకొందురు
నీతికొర కాకలి - దప్పులు గలవారు
ధన్యులు వారు తృప్తి - పరచబడుదురు
3. కనికరములుగల - వారు ధన్యులు
వారు కనికరము - పొందుదురు
హృదయశుద్ధిగల - వారు ధన్యులు
వారు దేవుని - చూచెదరు
4. సమాధానపరచు - వారు ధన్యులు వారు
దేవుని కుమారు - లనబడుదురు
నీతి నిమిత్తము హిం - సింపబడువారు
ధన్యులు పరలోక - రాజ్యము వారిది
5. నా నిమిత్తము జనులు - మిమ్మును నిందించి
హింసించి మీ మీద - అబద్ధముగా
చెడ్డ మాటలెల్ల - పలుకు నపుడు
మీరు ధన్యులు - మీరు ధన్యులు
6. సంతోషించి ఆనందించుడి పరలోకమందు
మీ ఫలము అధికమగును
ఈలాగున వారు - మీకు పూర్వమందు
ఉండిన ప్రవక్తలను - హింసించిరి

Your favourites

  • No Favourites found!