Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆయనే నా సంగీతము బలమైన కోటయును Telugu Christian Song Lyrics

ఆయనే నా సంగీతము బలమైన కోటయును Lyrics

ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము         ||ఆయనే||

స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2)          ||ఆయనే||

ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2)       ||ఆయనే||

సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2)       ||ఆయనే||

Your favourites

  • No Favourites found!