Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు Telugu Christian Song Lyrics

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు Lyrics

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2)       ||అబ్రాహాము||

అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)
యాకోబును ఇశ్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా (2)       ||అబ్రాహాము||

జీవాహారము నేనే అని పలికితివి
జీవ జలముల ఓరన నను నాటితివి (2)
నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
హృదయము నుండి జీవ జలములు పుట్టించి
నీ జీవాహారము – నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2)       ||అబ్రాహాము||

Your favourites

  • No Favourites found!