Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అడవి చెట్ల నడుమ ఒక జల్దరు Telugu Christian Song Lyrics

అడవి చెట్ల నడుమ ఒక జల్దరు Lyrics

అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు (2)
అను కీర్తింతున్ నా ప్రభుని - జీవకాలమెల్ల ప్రభుయేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)
1. షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే
అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్ఠుడు (2)
2. పరిమళతైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా
నిందశ్రమ సంకటములలో - నను సుగంధముగా చేయున్
3. మనోవేదన సహించలేక - సిలువవైపునే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి
4. నా త్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణనీవే
5. ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత
6. నీవు నా దాసుడవనియు - ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడని - భయపడకు మని అంటివి


Your favourites

  • No Favourites found!