అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి
నీదు ప్రేమ అపారము - ప్రభువా మాపై జూపితివి
1. మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు
నీ కిష్టులముగా బ్రతికి - దీవెనలెన్నో పొందెదము
2. నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్తజేసె
3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంచుమెంతో
4. తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది - దేవెనలెన్నో పొందెదము
5. ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి
ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము
6. ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినతో - దీవెనలెన్నో పొందెదము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు Lyrics
Your favourites
- No Favourites found!
