Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అదే అదే ఆ రోజూ యేసయ్య Telugu Christian Song Lyrics

అదే అదే ఆ రోజూ యేసయ్య Lyrics


అదే అదే ఆ రోజూ - యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజూ - పాపులంతా ఏడ్చే రోజు

1. సూర్యుడు నలుపయ్యే రోజూ - చంద్రుడు ఎరుపయ్యే రోజూ - 2
భూకంపం కలిగే రోజూ - దిక్కులేక అరచే రోజూ
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

2. వ్యభిచారులు ఏడ్చే రోజూ - మోసగాళ్ళు మసలే రోజూ - 2
అబద్ధికులు అరచే రోజూ - దొంగలంతా దొర్లే రోజూ
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

3. పిల్ల జాడ తల్లికి లేదు - తల్లి జాడ పిల్లకు లేదు - 2
చెట్టుకొక్కరై పుట్టకొక్కరై - అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

4. ఓ మనిషీ... యోచింపవా - నీ బ్రతుకు ఎలా ఉన్నదో - 2
బలము చూచి భంగపడకుమా - ధనము చూసి దగాపడకుమా
ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..

Your favourites

  • No Favourites found!