Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా యేసయ్య Telugu Christian Song Lyrics

ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా యేసయ్య Lyrics

ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా
యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య

1. రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా
ఎండలో వాడినా పువ్వునై నే రాలినా
దిక్కు తోచక నిన్ను చేరితి
కాదనవని నిన్ను నే వేడితి
నను దర్శించుమో యేసయ్య  (2)
నను ధైర్యపరచుమో నా యేసయ్యా
|| యేసయ్య ||

2. ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే
నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే
నీ తోడు నే కోరుకొంటిని
నీ పిలుపుకై వేచియుంటిని
నీ దరిచేర్చుకో- యేసయ్య  (2)
నన్ను కాదనకుమా నా యేసయ్యా
|| యేసయ్య ||

Your favourites

  • No Favourites found!