అధికారము పొంది యుంటిని - ప్రభూ
పరలోకమందును భూమి మీదను - నీవు
1. అన్నిటిలో నత్యధిక జయము నొందుచున్నాము
మనల ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభువు ద్వారనే
కనుల కగుపరచిన విజయముకై సన్నుతింతుము
2. విశ్వసించు మనయందు తన శక్తిని గూర్చి
అపరిమితమైన ప్రబావమును - యెరిగి యున్నాము
తిరిగి లేచిన ప్రభువును చూచి హర్షించెదము
3. మనల బలపరచు ప్రభువునందు బలము నొందుచు
ప్రభున కింపైన కార్యములను చేయుచుంటిమి
తనదు పునరుత్థాన బలమును పొగడెదమెపుడు
4. క్రీస్తు మరణములో సమానాను-భవము కలిగియు
కష్ట నష్టములలో పాలివారమగుట యెరిగియు
ఆత్మ ప్రాణ శరీరములతో ఆరాధింతము
5. మనల స్థిరపరచిన శక్తిగల దేవునికి
తనదు ప్రియ పుత్రుడు యేసుక్రీస్తు ద్వారనే తనకు
నిరతంబును మహిమ ఘనత హల్లెలూయామెన్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
అధికారము పొంది యుంటిని ప్రభూ పరలోకమందును Lyrics
Your favourites
- No Favourites found!
