అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే
నీ కన్నులెత్తి చూడుమా - క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్
1. మేఘారూఢుడై అచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్ల
వీణె వాయింప దూతల్ పాడంగ - పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్
2. సూర్యచంద్రులు అదృశ్యులైరి - మౄతులెవ్వరులేరు అచ్చట
అందరు భయపడి వణకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్
3. గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగును
నూతన మగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్
4. ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెను
అలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
అదిగో వచ్చునదెవరో చూడుమా మహిమ గలిగిన Lyrics
Your favourites
- No Favourites found!
