Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ తప్పక Telugu Christian Song Lyrics

అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ తప్పక Lyrics

అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ - తప్పక యిచ్చున్
అడిగెడి ప్రతివాడు పొందున్
1. భక్తులుభక్తులు విశ్వాసముతో - ప్రార్థించి పొందిరి
వారి జీవితముల నెంచి చూచి
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
2. మనలో తన శక్తికొలది - అనుగ్రహించును
ఊహకుమించి చేయు దేవునిని
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
3. మన ప్రార్థనల నాలకించి - సంతృప్తి చెందును
తన నామమునకు మహిమ కలుగ
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
4. ఇదివరకు మీరేమియు - అడుగకుంటిరి
మీరానంద భరితులగునట్లు
మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
5. దేవుని కేదైనను - చేయ నసాధ్యమా
సర్వశక్తిగల మన దేవునడిగి
ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు


Your favourites

  • No Favourites found!