అద్వితీయుడా కాచుకొంటివి
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా
నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు (2)
నీ ప్రేమను ఎవరు చూపలేరు || అద్వితీయుడా ||
1. మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు (2)
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి (2)
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు (2)
|| నీ ప్రేమకు ||
2. నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు (2)
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి (2)
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ (2)
|| నీ ప్రేమకు ||
3. ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు (2)
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి (2)
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు (2)
|| నీ ప్రేమకు ||
