Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అద్యంతరహితుడవగు మా జ్యోతిమేదిని ప్రభూ నిన్ Telugu Christian Song Lyrics

అద్యంతరహితుడవగు మా జ్యోతిమేదిని ప్రభూ నిన్ Lyrics

1. అద్యంతరహితుడవగు మా జ్యోతి
మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము - మేదిని
నా దీన కాపరి నీతి కృపానిధి
శుధ్ధ దివ్యగత్రుడా
2. మనోహరమగు నీ కృప పొందను
మానవు లెల్లరము చేరితిమి - మానవు
ఆత్మరూప కృపామయా నీ కరుణా
వరముల మాకీయుమా
3. పాలచే కడుగబడిన - ధవళాక్షుడా
వళ్లిపూలయందు తిరుగువాడా - వళ్లి
షాలేము రాజా షారోను రోజా
శాంత భూపతివి నీవే
4. లక్షల దూతల స్తుతుల నందువాడా
అక్షయ హేమమకుట ధారుడా - అక్షయ
హేమ కిరీటధారులమై స్వర్గంబు
చేర కడవరి వర్షమీ
5. క్రొత్త యెరూషలేం నగర రాజా
రత్నాల పునాది వేసితివి - రత్నాల
ధీరతతో నీ సాక్ష్యము చాటను
స్థిరమగునాత్మ నిమ్ము
6. శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన
ఇష్టంపురూప లావణ్యవతీ - ఇష్ట
అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము
పాత్రులుగా చేయుమా


Your favourites

  • No Favourites found!