Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు Telugu Christian Song Lyrics

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు Lyrics

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2)           ||ఏ బాధ||

ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా            ||దిగులేల||

పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా          ||దిగులేల||

Your favourites

  • No Favourites found!