Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏ యోగ్యతా లేని నన్ను Telugu Christian Song Lyrics

ఏ యోగ్యతా లేని నన్ను Lyrics


ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును (2)        ||ఏ యోగ్యతా||

కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు (2)
పావన దేహంలో గాయాలు పొంది (2)
రక్తమంత చిందించినావా          ||నీకేమి||

సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నాకీయుటకు (2)
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2)
నీ సొగసును కోల్పోయినావా          ||నీకేమి||

పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు (2)
నా స్థానమందు నా శిక్ష భరించి (2)
మరణించి తిరిగి లేచావా           ||నీకేమి||

Your favourites

  • No Favourites found!