Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు Telugu Christian Song Lyrics

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు Lyrics

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని||

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని||

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)       ||అగ్ని||

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)       ||అగ్ని||

Your favourites

  • No Favourites found!