Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను Telugu Christian Song Lyrics

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను Lyrics

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను 2
మధుర ప్రేమతో మనసులు కలువ
హృదయ సీమలే ఒకటిగ నిలువ
నీ దీవెనలే పంపుమా – 1  

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను – 1

1. ఆనందముతోడ దు:ఖమునే గెల్వ
చిరునవ్వుతోడ కష్టముల నోర్వ – 2
సంసార నావను సరిగా నడిపించ – 2
నీవే సహాయమీయుమా

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను – 1

2. ప్రార్ధనా జీవితము సమాధనము
భక్తి విశ్వాసము నీతి న్యాయము – 2
నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం – 2
అనుగ్రహించి నడిపించుమా

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను – 1

3. ఇహలోకభోగముపై మనసుంచక
పరలోక భాగ్యముపై క్ష్యముంచగ – 2
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై – 2
సాగే కృప దయచేయుమా

ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను – 1

Your favourites

  • No Favourites found!