Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అమర లోకనాథుడా అంతమే లేనివాడ Telugu Christian Song Lyrics

అమర లోకనాథుడా అంతమే లేనివాడ Lyrics

అమర లోకనాథుడా అంతమే లేనివాడ
సర్వలోకనాథుడా ఆది మద్యాంత రహితుడా  (2)
సకల జనులకు ఆరాధ్యుడవు
సృజన శీలుడ శుభకరుడా  (2)

నీవే నా సర్వము నీవే నా జీవము
నీవే నా ఆరాధన యేసయ్య   (2)  || అమర ||

1. శూన్యములో భూమిని వ్రేలాడదీసితివి
అగాధ జలములను రాసిగా పోసితివి  (2)
నిన్నశ్రయించిన నీ జనులకు అద్భుతాలే చేసితివి
అసాధ్యమైన వాటిని సాధ్యము చేసితివి  (2)  || నీవే ||

2. సర్వలోకమును సృష్టించిన వాడవు
మానవజాతికి నిర్మాణ కర్తవు   (2)
మనుషులపై ప్రేమతో సిలువ త్యాగమే చేసితివి
విశ్వసించిన వారికి రక్షణ నిచ్చితివి (2)  || నీవే ||

3. ప్రళయ జలములపై ఆసీనుడా యేసయ్య
నిత్యము రారాజుగా మా మధ్య నిలచితివి  (2)
నిను వెంబడించిన నీవారికి మోక్షమార్గమే చూపితివి
సుఖ సౌఖ్యాలతోఆశీర్వదించితివి (2)  || నీవే ||

Your favourites

  • No Favourites found!