అమర లోకనాథుడా అంతమే లేనివాడ
సర్వలోకనాథుడా ఆది మద్యాంత రహితుడా (2)
సకల జనులకు ఆరాధ్యుడవు
సృజన శీలుడ శుభకరుడా (2)
నీవే నా సర్వము నీవే నా జీవము
నీవే నా ఆరాధన యేసయ్య (2) || అమర ||
1. శూన్యములో భూమిని వ్రేలాడదీసితివి
అగాధ జలములను రాసిగా పోసితివి (2)
నిన్నశ్రయించిన నీ జనులకు అద్భుతాలే చేసితివి
అసాధ్యమైన వాటిని సాధ్యము చేసితివి (2) || నీవే ||
2. సర్వలోకమును సృష్టించిన వాడవు
మానవజాతికి నిర్మాణ కర్తవు (2)
మనుషులపై ప్రేమతో సిలువ త్యాగమే చేసితివి
విశ్వసించిన వారికి రక్షణ నిచ్చితివి (2) || నీవే ||
3. ప్రళయ జలములపై ఆసీనుడా యేసయ్య
నిత్యము రారాజుగా మా మధ్య నిలచితివి (2)
నిను వెంబడించిన నీవారికి మోక్షమార్గమే చూపితివి
సుఖ సౌఖ్యాలతోఆశీర్వదించితివి (2) || నీవే ||
