Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా Telugu Christian Song Lyrics

అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా Lyrics

అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
1. మన యౌవన జీవితముల్ - శరీరాశకు లోబరచి
చెడుమాటలను పలుకుచు - శాంతిలేక యుంటిమిగా
2. చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి
3. నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక
స్వంత నీతితోడనే - దేవుని రాజ్యము కోరితిమి
4. కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను
5. తన రక్తధారలలో - మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో
6. పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము
7. మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్


Your favourites

  • No Favourites found!