Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అనంతుడా ఆదరించే యేసయ్యఆకాశమందు నీవు తప్ప Telugu Christian Song Lyrics

అనంతుడా ఆదరించే యేసయ్యఆకాశమందు నీవు తప్ప Lyrics

అనంతుడా ఆదరించే యేసయ్య
ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరూ వున్నారాయ
అనురాగ నిలయుడా ఐశ్వర్యవంతుడా
కనికర పూర్ణుడా నా యేసయ్య
కష్టాల కొలిమిలో నీకిష్టమైన రూపు చేసి
నీ చేతి స్పర్శ తో ప్రతి క్షణము నన్ను ఆదరించి
మహిమ స్వరూపుడా నా చేయి విడువక
అనురాగము నాపై చూపించుచున్నావు
శత్రువు పై సమరములో రథ సారథివై నడిపినావు
నీ నియమాలను నేర్పించి శత్రువును ఓడించినావు
విజయ సమరయోధుడా నాకు జయము నిచ్చి
విజయోత్సవాలతో ఊరేగించుచున్నావు
విడువక నన్ను ప్రేమించే నిజ స్నేహితుడై నిలిచినావు
నీ హస్త బలముతో అగాధాలు దాటించినావు
నీ సన్నిధి కాంతిలో నన్ను తేజరిల్ల చేసి
ఆనంద నగరికై సిద్ధపరచు చున్నావు

Your favourites

  • No Favourites found!