Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అందమైన పొదరిల్లు నీది అందులోన అనురాగమున్నది Telugu Christian Song Lyrics

అందమైన పొదరిల్లు నీది అందులోన అనురాగమున్నది Lyrics

అందమైన పొదరిల్లు నీది

అందులోన అనురాగమున్నది (2)

అంతులేని త్యాగమే నీది

అవథులు లేని అనుంబంధమే మనది (2)

యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము

యేసయ్యా నీ కృపయే అమృతము (2)

                       || అందమైన ||

1. ఆనంద నిలయము నీ సన్నిధానము

అభాగ్యులందరికి ఆశ్రయపురమది  (2)

అవసరాలు తీర్చే దాతృత్వము నీది

ఆశ్రయించువారికి సౌభాగ్య నిలయమ (2)

                       ॥ యేసయ్యా ॥

2. ఆదర్శమైనా ప్రేమా నిలయము

అన్యోన్యత నిండిన అమరాలయము (2)

అప్తులెవరు చూపని అనురాగము నీది

అనుక్షణము నాపై కృప చూపునది (2)

                       ॥ యేసయ్యా ॥

3. అమోఘమైనవి నీ కార్యములు

అవనిలో నాకవి ఘనకీర్తులు (2)

అమూల్యమైనవి నీ ఉపదేశములు

ఆత్మాభివృద్దికి ఆభరణములు (2)

                       ॥ యేసయ్యా ॥

Your favourites

  • No Favourites found!