Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో Telugu Christian Song Lyrics

అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో Lyrics

అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య...

1. నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె
ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...||అ||

2. మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ
మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి
జయధ్వనులిడిరె ||అ||

3. ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా
ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||

4. లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని
జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||

5. పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు
నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని
కరుణ యిదే ||అ||

6. హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు
చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||

Your favourites

  • No Favourites found!