Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా Telugu Christian Song Lyrics

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా Lyrics

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2)

మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ            ||అంకితం||

కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ         ||అంకితం||

Your favourites

  • No Favourites found!